: ఉత్తరాఖండ్ లో ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్న నదులు.. ఆగని వరదలు


ఉత్తరాఖండ్ ను వరదలు వదలడం లేదు. భారీ వర్షాలకు రాష్ట్రంలోని నదులన్నీ ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ప్రముఖ నదులైన సరయు, శారద, గోరి, భాగీరథి ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తుండగా అలకనంద, మందాకిని నదులు ఏ క్షణాన్నయినా డేంజర్ మార్కును దాటే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. వరదల కారణంగా జరిగిన ప్రమాదాల్లో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందారు. ఆదివారం మరో ముగ్గురు గల్లంతయ్యారు. చార్ ధామ్ యాత్రకు వెళ్తున్న భక్తుల్లో 900 మంది వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. చాలా ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. రైల్వే ట్రాకులు దెబ్బతినడంతో పలు రూట్లలో రైళ్లను రద్దు చేశారు. వరదలు తగ్గుముఖం పట్టేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

  • Loading...

More Telugu News