: తప్పు జరిగిపోయిందని చెబుతూ... స్వర్ణ దేవాలయంలో అంట్లుతోమిన కేజ్రీవాల్!


ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల విడుదల చేసిన '51 పాయింట్ యూత్ మ్యానిఫెస్టో' ముఖచిత్రంపై గోల్డెన్ టెంపుల్ చిత్రం సూపర్ ఇంపోజ్ కావడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పారు. పొరపాటున ఓ మతానికి చెందిన చిత్రం ప్రింట్ అయిందని వెల్లడించిన ఆయన, ఈ ఉదయం గోల్డెన్ టెంపుల్ కు వచ్చి, స్వీయశిక్షగా, అక్కడ పని చేశారు. టెంపుల్ ప్రాంగణంలో గిన్నెలు కడిగారు. అక్కడి కిచన్ లోకి వెళ్లి వాడిన వంటపాత్రలను శుభ్రం చేశారు. "స్వచ్ఛందంగా పని చేసేందుకే నేను ఇక్కడికి వచ్చాను. అనుకోకుండా జరిగిన తప్పది. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది" అని తెలిపారు. దాదాపు గంటకు పైగా దేవాలయంలో గడిపిన 'ఆప్' చీఫ్, ఆపై కాసేపు గరిట తిప్పి ప్రసాదాల తయారీలో సహాయపడ్డారు.

  • Loading...

More Telugu News