: పుష్కరాలు జరిగే 12 రోజులూ అమరావతిలో అయుత చండీయాగం
అయుత చండీయాగం... ఈ పేరు గుర్తుందిగా? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోరుతూ నిర్వహించిన యాగం. ఇప్పుడు అదే తరహా యాగం నవ్యాంధ్రలో జరగనుంది. పుష్కరాలు జరిగే 12 రోజుల పాటు ధ్యాన బుద్ధ ప్రాజెక్టు సమీపంలో యాగం నిర్వహించేందుకు నేటి సాయంత్రం శంకుస్థాపన పనులు ప్రారంభం కానున్నాయి. గుంటూరులోని భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్, ఈ మహాయాగాన్ని వచ్చే నెల 11 నుంచి 23 వరకూ నిర్వహించనుంది. నేడు జరిగే శంకుస్థాపనకు కంచి కామకోఠి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతులతో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారని పరిషత్ కార్యదర్శి బీ సత్యనారాయణ వెల్లడించారు.