: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో ఉగ్రవాది బుర్హాన్ వాని అనుకూల నినాదాలు... టెన్షన్ టెన్షన్!


రోహిత్ వేముల ఆత్మహత్య, తదనంతరం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నుంచి కోలుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో మరోసారి ఇప్పుడు తీవ్ర ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. పది రోజుల క్రితం కశ్మీర్లో భద్రతా దళాల ఎన్ కౌంటర్ లో మరణించిన హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వానీకి అనుకూలంగా ఓ వర్గం ర్యాలీ నిర్వహించి, అనుకూల నినాదాలు ఇవ్వడం, వీటిని మరో విద్యార్థి సంఘం అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా, ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఘర్షణలు మరింతగా పెరగవచ్చని, సంఘ విద్రోహ శక్తులు క్యాంపస్ లోకి రావచ్చని నిఘా వర్గాలు హెచ్చరించడంతో, ముందు జాగ్రత్త చర్యగా భారీ ఎత్తున పోలీసులను, భద్రతా సిబ్బందిని మోహరించారు.

  • Loading...

More Telugu News