: భక్తులకు తీవ్ర నిరాశ... అదృశ్యమైన అమరనాథుడు


హిమాలయ పర్వతాల్లో 130 అడుగుల ఎత్తయిన అమర్ నాథ్ గుహలో ప్రకృతి సిద్ధంగా ప్రతియేటా 20 అడుగుల ఎత్తున స్వయంగా ఉద్భవించే మంచు శివలింగం ఈ ఏడు కేవలం 16 రోజులు మాత్రమే దర్శనమిచ్చింది. జూలై 2న యాత్ర మొదలైన సమయానికి 10 అడుగుల ఎత్తున ఉన్న అమరనాథుడి మంచు రూపం పూర్తిగా కరిగిపోయింది. ప్రతియేటా ఆగస్టులో 18వ తేదీ వరకూ యాత్ర జరుగుతుందన్న సంగతి తెలిసిందే. కాగా, మంచులింగం ఇంత త్వరగా అదృశ్యం కావడం, ఈ దశాబ్దంలోనే తొలిసారని అధికారులు అంటున్నారు. గుహలో లింగం కనిపించకపోవడంతో, అత్యంత వ్యయ ప్రయాసలకోర్చి చేరుకున్న భక్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు. శ్రీనగర్, బల్తాల్ తదితర ప్రాంతాల్లోని క్యాంపుల్లో ఉన్న భక్తులు వెనుదిరుగుతున్నారు. భూతాపం కారణంగానే మంచులింగం త్వరగా కరిగిపోయినట్టు అధికారులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News