: అమెరికాలో మరోమారు గర్జించిన తుపాకి.. ముగ్గురు పోలీసు అధికారుల మృతి


అగ్రరాజ్యం అమెరికాలో మరోమారు తుపాకి గర్జించింది. ముగ్గురు పోలీసు అధికారులను బలితీసుకుంది. లూసియానాలోని బ్యాటన్ రోజ్ లో ఓ దుండగుడు ఆదివారం పోలీసులపై తుపాకితో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోగా మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులకు తెగబడ్డ దుండగుడిని పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటనపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మాట్లాడుతూ ఈ ఘటన వెనుక ఉన్న ఉద్దేశం తెలియరాలేదన్నారు. హింసాత్మక ఘటనలకు దారితీసేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ప్రజలను కోరారు. నల్ల జాతీయుల కాల్చివేతకు నిరసనగా ఇటీవల డాలస్ లో ఓ దుండగుడు ఐదుగురు పోలీసులను కాల్చి చంపిన సంగతి తెలిసిందే. తాజా ఘటన రెండు వారాల్లో రెండోది కావడం గమనార్హం.

  • Loading...

More Telugu News