: అన్ని ఆధారాలతోనూ ఈ పుస్తకం రాశాను: ‘గడచిన చరిత్ర - తెరిచిన అధ్యాయం’ ఆవిష్కరణలో కాంగ్రెస్ నేత జైరాం రమేష్
‘గడచిన చరిత్ర - తెరిచిన అధ్యాయం’ అనే పుస్తకాన్ని తాను అన్ని ఆధారాలతోనూ రాశానని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అన్నారు. హైదరాబాద్ లోని తెలుగు విశ్వవిద్యాలయంలో ఈరోజు ఈ పుస్తకాన్ని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం జైరాం రమేష్ మాట్లాడుతూ, రాష్ట్ర విభజనలో తన పాత్ర ఏమీ లేదని, 2 రాష్ట్రాలకు హైకోర్టులు ఉండాలని ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోనే ఉందని, నేడు హైకోర్టు ఏర్పాటు చేయకపోవడానికి కారణం కేంద్ర వైఫల్యమేనని అన్నారు. తెలంగాణ వాసులు హైదరాబాద్ సాధిస్తే, ఏపీ వాసులు పోలవరం దక్కించుకున్నారని అన్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన టీజేఏసీ కోదండరామ్, కాంగ్రెస్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడారు.