: సినీ ఇండస్ట్రీలో నోటి వరకు వచ్చిన వాటిని చెడగొట్టేవాళ్లు వుంటారు!: సంగీత దర్శకుడు రఘు


‘సినీ ఇండస్ట్రీ ఎట్లాంటిదంటే మనం ఒంగితే భుజమెక్కుతుంది, మనము ఎక్కితే అది ఒంగుంటుంది’ అని సంగీత దర్శకుడు, ఆర్టిస్టు, సింగర్ రఘు అన్నారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ, తన కెరీర్ మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డానని, వచ్చిన అవకాశాలు చేజారడం, ఇతనితో పాడిస్తే విజయవంతం కావనే ముద్ర పడటం వంటి ఎన్నో అనుభవాలను చూశానని, కాల క్రమంలో వాటి నుంచి బయటపడి నిలదొక్కుకున్నానని చెప్పాడు. నోటి వరకు వచ్చిన అవకాశాలను చెడగొట్టేవాళ్లు ఉంటారని, మానసిక ఒత్తిడికి గురై ప్రాణాలు తీసుకుంటున్న వారు ఇండస్ట్రీలో ఉన్నారని అన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఒక దరిద్రపు అలవాటుందని, ఫలానా వాళ్లు నటిస్తే కలిసొస్తుందని, ఫలానా వాళ్లు పాడితే చిత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుందనేవి ఇక్కడ ఎక్కువగా ఉంటాయని రఘు చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News