: ‘విభజన’ అంశంలో మాజీ సీఎం కిరణే దోషి: ఎంపీ జైరాం రమేష్
రాష్ట్ర విభజన అంశంలో మాజీ సీఎం కిరణ్ కుమారే అసలు దోషని ఎంపీ జైరాం రమేష్ ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, విభజన జరగదని సీమాంధ్ర ప్రజలను కిరణే మభ్యపెట్టారని అన్నారు. కిరణ్ వల్ల మొత్తం వ్యవస్థ నాశనమైందని, రాజకీయ, సామాజిక, ఆర్థిక కోణాల నుంచి విభజన నిర్ణయం జరిగిందని అన్నారు. రాష్ట్ర విభజన కాంగ్రెస్ పార్టీకి ఆత్మహత్యా సదృశమేనని, విభజన గురించి సీమాంధ్ర నాయకులకు ముందే తెలుసునని జైరాం రమేష్ ఆరోపించారు.