: మైఖేల్ జాక్సన్ మారువేషాల్లో తిరుగుతుండేవాడట!


పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ ఒక్కోసారి మారువేషాల్లో తిరుగుతుండేవాడని ఆయన వ్యక్తిగత ఫిిజిషియన్ డాక్టర్ కన్రాడ్ ముర్రే వెల్లడించారు. మైఖేల్ జాక్సన్ మృతి కేసులో దోషిగా నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తిచేసుకున్న ఆయన ‘This is it: laying bare grim’ అనే పుస్తకాన్ని రాశారు. మైఖేల్ జాక్సన్ వ్యక్తిగత విషయాలతో రాస్తున్న ఈ పుస్తకం గురించి ఆయన మాట్లాడుతూ, బహిరంగ ప్రదేశాల్లో తిరగడం, నైట్ క్లబ్ లకు వెళ్లడం, చిన్న చిన్న హోటళ్లలో బస చేయడం లాంటిపనులు జాక్సన్ కు ఇష్టమని చెప్పారు. అయితే, ఆయన్ని చూస్తే అభిమానులు, కాల్ గర్ల్స్ మీదపడిపోతారనే భయం కారణంగా మారువేషాలు వేసుకుని జాక్సన్ ఆయా ప్రదేశాలకు వెళుతుండేవాడని ముర్రే పేర్కొన్నారు. సౌదీ అరేబియా నుంచి వచ్చానంటూ ఆ యాసలో ఆయన మాట్లాడేవాడని, సౌదీ సంప్రదాయ దుస్తులు ధరించి జనాలను బోల్తా కొట్టించేవాడంటూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ‘హ్యారీ పోటర్’ సినిమాలో నటించిన ఎమా జాక్సన్ ను, మైఖేల్ జాక్సన్ స్నేహితుడి కూతురు హెరియట్ లిస్టర్ ను మన పాప్ కింగ్ పెళ్లి చేసుకోవాలనుకున్నాడని, అప్పుడు ఎమా వయసు పదేళ్లని చెప్పాడు. అయితే, లిస్టర్ ని మాత్రం యుక్తవయసులోకి వచ్చిన తర్వాతే పెళ్లాడాలని మైఖేల్ జాక్సన్ భావించినట్లు ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ఇంకా విడుదల కాని ఈ పుస్తకంలో ఇలాంటివే మరెన్నో విశేషాలు వున్నాయట.

  • Loading...

More Telugu News