: రణ్ వీర్ సింగ్ పై మండిపడ్డ సల్మాన్ ఖాన్!
బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ పై కండల వీరుడు సల్మాన్ ఖాన్ మండిపడ్డాడు. ఎందుకంటే, సల్మాన్ తాజా చిత్రం ‘సుల్తాన్’ను పారిస్ లో రణ్ వీర్ ఇటీవల చూసిన విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమాకు వెళ్లిన రణ్ వీర్ స్క్రీన్ ముందు స్టెప్పులు వేస్తూ నానా హంగామా చేశాడు. ఈ విషయమై కండలవీరుడు మండిపడుతున్నాడు. తెరముందు నిలుచుని ప్రేక్షకులను ‘సుల్తాన్’లో తనను చూడనీయకుండా చేశాడని, అందుకే రణ్ వీర్ తల పగలగొడతానంటూ సల్మాన్ సరదాగా మండిపడ్డాడు.