: 2 పరుగులకు 4 వికెట్లు పోయిన వేళ, గేల్ దుమ్ము దుమారం!
కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా జరిగిన క్రికెట్ పోటీల్లో గేల్, షకీబ్ అల్ హసన్ లు అద్భుతమని చెప్పదగ్గ ఇన్సింగ్స్ ఆడారు. జమైకా తలావాహ్స్, గుయానా అమేజాన్ వారియర్స్ మధ్య జరిగిన పోటీ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుయానా జట్టు ఆరు వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. ఆపై గాయం కారణంగా గేల్ ఓపెనర్ గా రాలేకపోయాడు. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ ప్రారంభించిన జమైకా జట్టు రెండు పరుగులకు 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. గాయంతోనే గేల్ బరిలోకి దిగాల్సి వచ్చింది. ఆపై క్రీజులో ఉన్న బంగ్లా ఆటగాడు షకీబ్ సాయంతో గేల్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. ఓ వైపు బాధను భరిస్తూనే మరో వికెట్ పోకుండా, జట్టును 25 పరుగులు మిగిలి ఉండగానే విజయ తీరాలకు చేర్చారు. షకీబ్ 53 పరుగులు, గేల్ 45 పరుగులు చేశారు.