: లైంగిక వేధింపులకు గురయ్యే ఉద్యోగినులకు 90 రోజుల పెయిడ్ లీవ్: మోదీ సర్కారు కీలక నిర్ణయం


కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తూ, లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు గురయ్యే మహిళలకు 90 రోజుల వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయాలని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిందితులకు కఠిన శిక్షలు పడేలా విచారణకు పూర్తిగా సహకరించేందుకు ఈ సెలవు ఉపకరిస్తుందని వివరించింది. విచారణ ముగిసేంత వరకూ లేదా గరిష్ఠంగా 90 రోజుల పాటు సెలవును గ్రాంట్ చేయాలని అన్ని విభాగాలకూ డీఓపీటీ (డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) నుంచి ఆదేశాలు అందాయి. బాధితులకు ఈ నిర్ణయం ఎంతో రిలీఫ్ ను ఇస్తుందని భావిస్తున్నట్టు డీఓపీటీ సీనియర్ అధికారి తెలిపారు.

  • Loading...

More Telugu News