: సంచలనం సృష్టించిన ఖండీల్ బాలోచ్ దారుణ హత్య కేసులో సోదరుడి అరెస్ట్


పాక్ ఇంటర్నెట్ స్టార్, సెలబ్రిటీ ఖండీల్ బాలోచ్ ను దారుణంగా హత్య చేసిన ఆమె సోదరుడు వసీమ్ అజీమ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలోచ్ వ్యాఖ్యలు, సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్న ఫోటోలను అసహ్యించుకుంటూ, తన వైఖరిని మార్చుకోవాలని హెచ్చరిస్తూ వచ్చిన అజీమ్, ఆమెను గొంతు నులిమి పరువు హత్య చేశాడని బాలోచ్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తప్పించుకు తిరుగుతున్న అతన్ని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఓ సెల్ ఫోన్ షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్న వసీమ్ అజీమ్ ను ముల్తాన్ సమీపంలోని ఓ ఇంట్లో అరెస్ట్ చేసినట్టు వివరించారు. ఆమె మృతికి దారితీసిన కారణాలపై విచారిస్తున్నామని, పోస్టు మార్టం రిపోర్టు కోసం వేచి చూస్తున్నామని వివరించారు.

  • Loading...

More Telugu News