: సింగపూర్ తో డీల్స్ వెనుక చంద్రబాబు భారీ కుంభకోణం, ప్రధానికి వివరాలు: వైకాపా


నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం నిమిత్తం సింగపూర్ కేంద్రంగా నడుస్తున్న సంస్థలతో చంద్రబాబు సర్కారు కుదుర్చుకుంటున్న డీల్స్ వెనుక భారీ కుంభకోణం దాగుందని వైకాపా ఆరోపించింది. కొద్దిసేపటి క్రితం ఏలూరులో వైకాపా నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పాలనలో లక్ష కోట్ల రూపాయలకు పైగా అవినీతి జరిగిందని, ఇందుకు సంబంధించిన వివరాలతో పుస్తకాలు ముద్రించి ప్రధాని నరేంద్ర మోదీకి వివరించామని ఆయన అన్నారు. స్విస్ చాలెంజ్ పద్ధతిని గతంలో సుప్రీంకోర్టు తప్పు పట్టిందని గుర్తు చేసిన ఆయన, సింగపూర్ సంస్థలతో డీల్స్ పై సిబీఐ లేదా సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని బొత్స డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News