: ఒక వైపు ఉగ్రవాదులు, మరోవైపు జికా... రియోకు దూరమవుతున్న కీలక ఆటగాళ్లు!


రియోలో ప్రారంభమయ్యే ఒలింపిక్స్ పోటీలపై ఉగ్రవాదులు దాడులు చేయవచ్చన్న భయాలు ఒకవైపు, జికా వైరస్ సోకవచ్చన్న ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యం మరోవైపు... వెరసి కీలక ఆటగాళ్లు తాము పాల్గొనలేమని తప్పుకుంటున్నారు. వింబుల్డన్ రన్నరప్ రానిచ్, 2014 ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ హాలెప్ లు, తాము రాబోవడం లేదని తేల్చి చెప్పారు. జికా వైరస్ తమకు భయాన్ని కలిగిస్తోందని, వీరిద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. భద్రతను సాకుగా చూపుతూ పలువురు ఆటగాళ్లు ఇప్పటికే రియోకు దూరమైన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, మొత్తం 85 వేల మందితో ఒలింపిక్ గ్రామానికి భద్రతను కల్పిస్తున్నామని, ట్రాఫిక్ నిబంధనలను కఠినం చేశామని, అదనపు చెక్ పాయింట్లు, బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామని, ఆటగాళ్ల భద్రతకు ఎలాంటి ప్రమాదమూ ఉండబోదని బ్రెజిల్ అధికారులు అభయమిస్తున్నప్పటికీ, ఆటగాళ్ల ఆందోళనలు తగ్గకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News