: తెలుగు రాష్ట్రాల హైకోర్టులో 'ఈ-కోర్టు' ప్రారంభం


తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో 'ఈ-కోర్టు' ప్రారంభమైంది. ఈ-కోర్టును సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, న్యాయమూర్తులు మరింతగా టెక్నాలజీని వినియోగించుకోవాలని అభిలషించారు. గత మూడు, నాలుగు సంవత్సరాల నుంచి సాంకేతిక పరంగా అనేక మార్పులు వచ్చాయని అభిప్రాయపడ్డ ఆయన, వాటిని న్యాయ వ్యవస్థ ఇంకా పూర్తిగా అందిపుచ్చుకోలేదని అన్నారు. ఈ దిశగా ముందడుగు వేయాల్సి వుందని, ఈ-కోర్టులకు తగినంత మంది సిబ్బందిని తక్షణమే నియమించాలని సూచించారు. ఆన్ లైన్ లో డేటా ఎంట్రీని వేగంగా పూర్తి చేయాలని, దీనిపై న్యాయాదికారులు దృష్టిని సారించాలని కోరారు.

  • Loading...

More Telugu News