: పెమా ఖండూను పిలిచిన అరుణాచల్ గవర్నర్, కాసేపట్లో ప్రమాణ స్వీకారం
అరుణాచల్ ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా 36 ఏళ్ల పెమా ఖండూ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఈటానగర్ లో జరుగుతున్నాయి. నిన్న సమావేశమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఖండూను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోగా, తనకు మద్దతు తెలుపుతున్న వారి జాబితాను ఖండూ గవర్నర్ కు అందించారు. దీంతో ఆయన ఖండూను ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా కోరారు. మొత్తం 60 మంది సభ్యులున్న అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ కు 45 మంది సభ్యుల బలముండగా, మరో ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నారు. ఖండూ బాధ్యతలు చేపట్టిన తరువాత అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది.