: గుజరాత్ లో భూకంపం... ఇళ్లలోంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు!


కొద్దిసేపటి క్రితం గుజరాత్ లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. దక్షిణ గుజరాత్ లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.7గా నమోదైంది. సూరత్, వడోదరా, అమ్రేలీ తదితర ప్రాంతాల్లో ప్రకంపనలు స్పష్టంగా తెలిశాయి. భూకంపంతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. ఎక్కడా ప్రాణనష్టం జరిగినట్టు వార్తలు వెలువడలేదు. కొన్ని భవంతులకు బీటలు పడ్డట్టు తెలుస్తోంది. సూరత్ కు 14 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉందని గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. మరింత సమాచారం వెలువడాల్సివుంది.

  • Loading...

More Telugu News