: రైలు ముందు ఏడుగురి స్టంట్... వణికిపోయిన డ్రైవర్!


ఘజియాబాద్ లోని మసూరి సమీపంలోని గంగా నదిపై ఉన్న బ్రిడ్జ్ మీదకు ఓ రైలు వేగంగా వస్తోంది. అదే బ్రిడ్జిపై ఏడుగురు యువకులు ఏ మాత్రం భయం లేకుండా నిలబడి ఉన్నారు. వారు ఎటూ వెళ్లేందుకు దారి లేదు, రైలుకు షడన్ బ్రేకు వేస్తే, పట్టాలు తప్పే ప్రమాదం. ఎదురుగా ఏడుగురు ఆకతాయి యువకులు జంకు లేకుండా కేరింతలు పెడుతుండటం చూసిన రైలు డ్రైవర్ వణికిపోయాడు. వారి ప్రాణాలు పోతాయని భయపడ్డాడు. రైలు వేగంతో దగ్గరకు వస్తున్న వేళ, మరో క్షణంలో అది వారిని గుద్దేసే సమయాన, వీరంతా నదిలోని నీళ్లల్లోకి దూకేశారు. ఒడ్డున ఉన్న వారి స్నేహితుడు ఈ మొత్తం ఘటనను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ఇది వైరల్ అయింది. దీనిపై అధికారులు సైతం సీరియస్ అయ్యారు. ఈ పిచ్చిపని చేసిన వారిని వెంటనే గుర్తించాలని పోలీసులను ఆదేశించారు. ఏమాత్రం ఏమరుపాటుతో ప్రాణాలు పోయే ఈ తరహా స్టంట్లు కూడదని సలహా ఇచ్చారు.

  • Loading...

More Telugu News