: కేంద్రానికి రూ. 2 కోట్లు బకాయిపడ్డ మీరా కుమార్


యూపీఏ పాలన సాగిన రోజుల్లో స్పీకర్ గా పనిచేసిన మీరా కుమార్, దాదాపు రూ. 2 కోట్ల వరకూ కేంద్రానికి చెల్లించాల్సిన అద్దె బకాయిలను ఎగ్గొట్టారు. ఈ విషయం సుభాగ్ చంద్ర అనే స.హ చట్టం కార్యకర్త ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ద్వారా వెలుగులోకి తెచ్చారు. మాజీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న జగ్ జీవన్ రామ్ బతికున్న సమయంలో ఢిల్లీలోని కష్ణ మీనన్ మార్గంలో ఆయనకు ఓ బంగళాను కేటాయించారు. ఆయన మృతి తరువాత జగ్ జీవన్ రామ్ సతీమణి ఇంద్రాణి అక్కడ ఉన్నారు. ఆమె మరణానంతరం, వీరి కుమార్తె మీరా కుమార్ అదే బంగళాను వాడుతున్నారు. దీని జోలికి ప్రభుత్వం రాకుండా చూసేందుకు, జగ్ జీవన్ రామ్ స్మారక భవనంగా మార్చారని, అందుకు ప్రభుత్వ అనుమతి ఏమీలేదని తెలుస్తోంది. భవంతికి సంబంధించి రూ. 1.98 కోట్ల అద్దెను మీరా కుమార్ బకాయి పడ్డట్టు రికార్డులు వెల్లడించాయి. అద్దెను రద్దు చేయాలని కూడా ఆమె ఎటువంటి దరఖాస్తులూ చేయలేదని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News