: అయాం ఫైన్... అభిమానులకు కమల్ హసన్ ఆడియో మెసేజ్


కళారంగంలో ప్రమాదాలు సహజమేనని, తాను క్షేమమేనని, ఆరోగ్యం బాగానే వుందని విలక్షణ నటుడు కమల్ హాసన్ తెలిపారు. రెండు రోజుల క్రితం తన కార్యాలయంలో మెట్లపై నుంచి జారిపడి, ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్న కమల్, తన అభిమానులకు ఓ ఆడియో మెసేజ్ పెట్టాడు. "నా కళాయాత్రలో ప్రమాదాలు సహజం. వాటి నుంచి అనేక పాఠాలు నేర్చుకున్నాను. ఈ ప్రమాదం జరిగి ఉండాల్సింది కాదు. కానీ జరిగింది. నేను క్షేమం. నా కుటుంబ సభ్యులు, అభిమానులు చూపుతున్న ప్రేమకు కృతజ్ఞుడిని" అని అన్నాడు. అతిత్వరలో తాను కోలుకుంటానని, తిరిగి షూటింగ్ లో పాల్గొంటానని కమల్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News