: నారాయణపూర్ కు భారీ వరద... బిరబిరా కదిలొస్తున్న కృష్ణమ్మ!


కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ఆల్మట్టి రిజర్వాయరుకు వస్తున్న నీరు 2 లక్షల క్యూసెక్కులకు పైగానే నమోదవుతోంది. వరద మరిన్ని రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నందున, విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి, 45 వేల క్యూసెక్కులు సహా, మొత్తం లక్షా 5 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 129.7 టీఎంసీల సామర్థ్యమున్న ప్రాజెక్టులో ప్రస్తుతం 100 టీఎంసీలకు పైగానే నీరు చేరింది. మరో 24 గంటల పాటు ఇదే ప్రవాహం కొనసాగితే డ్యామ్ పూర్తిగా నిండుతుందని అధికారులు అంటున్నారు. ఆల్మట్టి నుంచి వదిలిన నీరు నారాయణపూర్ రిజర్వాయర్ కు చేరుతోంది. మొత్తం 37 టీఎంసీల సామర్థ్యమున్న నారాయణపూర్ జలాశయం నిండాలంటే, మరో 20 టీఎంసీల నీరు అవసరం. ఎగువ నుంచి వరద కొనసాగితే, నేటి రాత్రికి రిజర్వాయర్ నిండు కుండవుతుంది. మరో మూడు రోజులు వరద నీరు కొనసాగితే, శ్రీశైలం డ్యాంకు నీరు చేరుతుందని అధికారులు వెల్లడించారు. కనీసం వారం రోజుల వరద ప్రవాహం కొనసాగితే, శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్ లు పూర్తి స్థాయిలో నిండుతాయి.

  • Loading...

More Telugu News