: రాష్ట్రం మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా వెంకయ్యనాయుడు రాష్ట్రానికి హోదా కల్పించేలా చేయాలి: రఘువీరా
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా రాష్ట్రానికి ప్రత్యేకహోదా వచ్చేలా చేయాలని ఏపీ పీసీసీచీఫ్ రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పలువురికి అందుతున్న సంక్షేమ పథకాల్లో కోత విధించేందుకే ప్రజాసాధికార సర్వే నిర్వహిస్తోందని ఆరోపించారు. ప్రధాని, ముఖ్యమంత్రి విదేశీపర్యటనల వల్ల పెట్టుబడులు రావు సరికదా, ప్రజాధనం వృథా అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయని, హోదా కోసం అంతా కృషి చేయాలని ఆయన సూచించారు.