: నా బయోపిక్ లో నటించడానికి ఎవరున్నారు?: సల్మాన్
తనది చాలా బోర్ కొట్టే జీవితమని అంటున్నాడు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్. 'సుల్తాన్' చిత్రం విజయం సాధించిన నేపథ్యంలో జరిగిన మీడియా సమావేశంలో సల్లూ భాయ్ మాట్లాడాడు. "బాలీవుడ్ లో బయోపిక్ ల చరిత్ర నడుస్తోంది కదా? మీ చరిత్రను ఎవరు తీస్తే బాగుటుంది?" అంటూ అడిగితే, "నాది చాలా బోరింగ్ లైఫ్. బోరింగ్ లైఫ్ మీద ఎవరూ సినిమా తీయాలనుకోరు. ఒకవేళ ఎవరైనా నా జీవిత చరిత్రను సినిమాగా తీస్తానని నన్ను సంప్రదిస్తే దానికి నేను అంగీకరించను. ఎందుకంటే నా జీవితం గురించి నా కుటుంబానికి మాత్రమే తెలుసు. నా జీవితం గురించి నా కుటుంబ సభ్యులు, తమ్ముళ్లు, చెల్లెళ్లు కథగా రాస్తే అది వాస్తవం అవుతుంది కానీ, ఎవరో ఒకరు రాస్తే అందులో వాస్తవాలు ఉండే అవకాశం లేదు. అదంతా పక్కన పెడితే నా బయోపిక్ లో నటించేందుకు సరైన నటుడు ఎవరున్నారో చెప్పండి? నాకు తెలిసి సల్మాన్ ను ప్రతిబింబించే నటుడు లేడు" అని సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చాడు.