: వైజాగ్ లో వివాదం రేపిన సంచలన వివాహం!


పాశ్చాత్య దేశాలకే పరిమితమైన లెస్బియన్ వివాహాలు భారత్ కు కూడా పాకినట్టు కనిపిస్తున్నాయి. విశాఖపట్టణంలోని గాజువాకలోని పారిశ్రామిక ప్రాంతంలో ఓ మహిళ ఓ మైనర్ బాలికను వివాహం చేసుకోవడం కలకలం రేపింది. మైనర్ బాలిక తల్లి చెబుతున్న ప్రకారం... 15 రోజుల క్రితం ఎల్మాజీ అలియాస్ తేజ (30) అనే మహిళ ఈమె కూతురికి పరిచయమైంది. 8 రోజుల క్రితం వారిద్దరూ వెళ్లి తిరుపతిలో వివాహం చేసుకున్నారు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. దీంతో ఆమె కోసం గాలించిన బంధువులు తిరుపతిలో వారిని పట్టుకున్నారు. దీంతో వారిని పట్టుకుని తీసుకువచ్చి వారి పెళ్లి చెల్లదంటూ, మైనర్ అయిన తమ కుమార్తెను ఎల్మాజీ వివాహం చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News