: 'ఫేస్ బుక్'లో పోస్టు కారును బహుమతిగా తెచ్చింది!


'ఇక్కడ జరిగే ఓ చర్య ఎక్కడో జరిగే మరో చర్యకు కారణమవుతుంది' అని ఆమధ్య వచ్చిన 'నాన్నకు ప్రేమతో' సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టు ఫేస్ బుక్ లో ఓ యువతి చేసిన పోస్టు, మరో వ్యక్తికి కారు వచ్చేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే...అమెరికాలోని న్యూహాంప్ షైర్ లో కైల్ బిగ్లర్ అనే వ్యక్తి వున్నాడు. జీవనోపాధి కోసం ఆయన రెండు ఉద్యోగాలు చేస్తున్నాడు. రెండు ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ వచ్చే ఆదాయం కొడుకు పోషణకు, బిల్లులు కట్టేందుకే సరిపోతోంది. దీంతో ఆయన ఈ ఉద్యోగాలు నిర్వర్తించేందుకు రోజూ 26 కిలోమీటర్లు నడిచేవాడు. ప్రతిరోజూ హడావుడిగా నడుస్తూ బిగ్లర్‌ తనకు తారసపడడాన్ని జోన్నా గ్రిఫిత్‌ అనే మహిళ గమనించింది. దీంతో ఎందుకలా ప్రతిరోజూ నడుచుకుంటూ వెళ్తున్నావని ఓ రోజు ప్రశ్నించింది. అతను తన పరిస్థితి వివరించడంతో, దానిని ఆమె ఫేస్ బుక్ లో హృద్యంగా రాసి పోస్టు చేసింది. ఆమె రాసిన కథనాన్ని 20 వేల మంది షేర్ చేసుకోగా, దానిని ఆటోసర్వ్‌ అనే కార్ల కంపెనీ చూసింది. దీంతో అతనిని కలిసిన ఆ కంపెనీ యాజమాన్యం అతనికి హోండా ఎకార్డ్‌ కారును బహుమతిగా అందజేసింది.

  • Loading...

More Telugu News