: ఫ్రాన్స్‌లోని నీస్ తరహా దాడి ఢిల్లీలోనూ జరగొచ్చు.. ఇంటెలిజెన్స్ హెచ్చరిక
ఫ్రాన్స్‌లోని నీస్‌లో తాజాగా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు రెచ్చిపోయిన ఉదంతం ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగించిన సంగతి తెలిసిందే. బాస్టిల్ డే సంబరాల్లో పాల్గొంటోన్న ప్రజలపైకి ఉగ్రవాది భారీ ట్రక్కుతో దూసుకెళ్లి దారుణంగా దాడి చేశాడు. అయితే ఇటువంటి దాడే ఇండియాలోనూ జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో పేర్కొంది. భారీ వాహనాలతో దూసుకొచ్చి ఢిల్లీలో బీభత్సం సృష్టించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా దేశ ప్రధాని మోదీ, మంత్రులు, ఇతర వీఐపీల కాన్వాయ్‌లపై ఉగ్రమూకలు విరుచుకుపడొచ్చని చెప్పింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు మోదీ కాన్వాయ్ వెళ్లే దారిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మోదీ కాన్వాయ్ వెళ్లే రూట్లలో భారీ వాహనాలను రానివ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో మోదీతో పాటు ఢిల్లీలోని వీఐపీలకు భద్రత కల్పించాల్సిన అంశంపై మరో 48 గంటల్లో అధికారులు మార్గదర్శకాలను ప్రకటించనున్నారు.