: డియర్ ఫ్యాన్స్! మీతో ఈ వార్త పంచుకునేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాను: టెన్నిస్ స్టార్ విక్టోరియా అజెరెంకా ప్రకటన


'డియర్ ఫ్యాన్స్! మీతో ఓ వార్త పంచుకునేందుకు చాలా ఆసక్తిగా ఉన్నా' అంటూ టెన్సిస్ స్టార్ విక్టోరియా అజెరెంకా అభిమానులకు ఒక లేఖ రాసింది. బెలారస్ కు చెందిన విక్టోరియా అజెరెంకా అద్భుతమైన ఆటతీరుతో వరల్డ్ ఆరో ర్యాంకు క్రీడాకారిణిగా కొనసాగుతోంది. మోకాలి నొప్పితో బాధపడుతున్న అజెరెంకా వింబుల్డన్ పోటీల్లో పాల్గొనలేకపోయింది. అయితే ప్రియుడితో సహజీవనం చేస్తున్న అజెరెంకా ఫలితం ప్రకటించింది. తాను, తన ప్రియుడు తల్లిదండ్రులు కాబోతున్నామని వైద్యులు నిర్ధారించారని చెప్పింది. ఈ విషయం అభిమానులకు తెలిపేందుకు సంతోషంగా ఉన్నానని తెలిపింది. దీంతో అజెరెంకా మరి కొంత కాలం ఆటకు దూరంగా గడపనుంది.

  • Loading...

More Telugu News