: 'సమాజానికి సేవ చేద్దాం... పూల్ పార్టీకి రండి' అంటూ పిలుస్తున్న రెజీనా
విద్యార్థులకు స్థైర్యం ఇచ్చేందుకు ముందుండే టాలీవుడ్ నటి రెజీనా కాసాండ్రా అభిమానులకు బంపర్ ఆఫర్ ఇస్తోంది. పేద విద్యార్థులను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన పూల్ పార్టీలో తనతో పాటు పాల్గొనాలని ఆహ్వానిస్తోంది. సన్ డౌన్ పూల్ పార్టీలో పాల్గోవడం ద్వారా అభిమాన నటి రెజీనాతో కొంత సమయం గడపడంతో పాటు, సమాజ సేవలో పాలుపంచుకోవాలని సదరు పార్టీ నిర్వాహకులు తెలిపారు. ఈ టికెట్ల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బును పేద విద్యార్థుల అవసరాలు తీర్చేందుకు ఉపయోగిస్తామని స్వచ్ఛంద సంస్థ తెలిపింది. రెజీనా గతంలో పేద విద్యార్థుల కోసం టీచర్ అవతారమెత్తిన సంగతి తెలిసిందే.