: గుత్తాపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పైన, ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డిపైన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. ఈరోజు నల్గొండ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గుత్తా సుఖేందర్‌రెడ్డి తనను విమర్శించే స్థాయిలో లేరని అన్నారు. గుత్తాది ఐరెన్ లెగ్ అని, అలాంటి వ్యక్తిని టీఆర్ఎస్లో చేర్చుకొని ఆ పార్టీ అధినేత కేసీఆర్ తప్పు చేశారని ఆయన అన్నారు. ఒకవేళ గుత్తా రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తే డిపాజిట్ కూడా దక్కదని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరిన తమ నేతలందరికీ ఇదే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన అన్నారు.