: ప్రతిపక్షాలు అబద్ధపు ఆరోపణలు చేస్తున్నాయి: పల్లె రఘునాథరెడ్డి
ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రతిపక్షపార్టీలపై మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సాధికార సర్వేపై ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేయవద్దని సూచించారు. ప్రతిపక్షాలు చేస్తున్నవన్నీ అసత్యప్రచారాలని ఆయన అన్నారు. తాము నిర్వహిస్తోన్న పల్స్ సర్వేతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకి సమర్థవంతంగా అందుతాయని ఆయన చెప్పారు. సర్వేలో ఎదురవుతోన్న సాంకేతిక లోపాలను అధిగమిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజలకి సంక్షేమ పథకాలు అందుతాయని ఓర్వలేకే ప్రతిపక్షాలు తమపై అసత్య ఆరోపణలు చేస్తూ, సర్వేని విమర్శిస్తున్నాయని ఆయన అన్నారు.