: అవినీతిలో ఏపీది ప్రథమ స్థానం...అందుకే పెట్టుబడులు రావు: రామచంద్రయ్య సంచలన వ్యాఖ్యలు
అవినీతిలో ఏపీది ప్రథమ స్థానమని కాంగ్రెస్ సీనియర్ నేత సి.రామచంద్రయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, అవినీతి కారణంగా ఏపీకి పెట్టుబడులు రావని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనలు చేసినంత మాత్రాన పెట్టుబడులు రావని చెప్పిన ఆయన, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే ఉన్న ఏకైక సాధనం ప్రత్యేకహోదా అని సూచించారు. అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో చంద్రబాబు ప్రత్యేక హోదాకోసం పట్టుబట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వెనుకబడిన జిల్లాలకు కేటాయించిన 700 కోట్ల రూపాయల్లో కేవలం ఏడు కోట్ల రూపాయలను మాత్రమే రాష్ట్రం ఖర్చు చేసిందని, దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సాక్షాత్తూ దేవుళ్లకే భద్రత లేకుండా పోయిందని ఆయన పేర్కొన్నారు.