: ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సం.. జనజీవనం అస్తవ్యస్తం
ఉత్తరాఖండ్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమయింది. కొన్ని రోజులుగా కురుస్తోన్న అతి భారీ వర్షాలకి నదులు పొంగిపొర్లుతున్నాయి. గంగానది ఉప్పొంగి ప్రవహిస్తోంది. చార్‌ధామ్ పుణ్యక్షేత్రంలోని గంగోత్రి దేవాలయాన్ని మహోగ్రరూపం దాల్చిన గంగానది ముంచెత్తింది. మరోవైపు శ్రీనగర్‌లో కుండపోత వర్షాలతో అలకనంద నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఆ నదీ పరీవాహక ప్రాంతంలోని దేవాలయాలు వర్షాలకు నీటమునిగాయి. భారీ వర్షాల వల్ల మల్ద్వానీ సహా అనేక పట్టణాలు ముంపునకు గురయ్యాయి. చిర్‌వాసా, దియోగఢ్ వద్ద రెండు వంతెనలు వరదల్లో కొట్టుకుపోయాయి. చయోలీలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. చార్‌ధామ్ యాత్రకు వెళ్లిన భక్తుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయచర్యలు కొనసాగుతున్నాయి