: ఫ్రాన్స్ నీస్ దాడి మేమే చేశాం: ఐఎస్ఐఎస్ ప్రకటన
ఫ్రాన్స్‌లోని నీస్‌లో బాస్టిల్ డే సంబరాల్లో పాల్గొంటోన్న ప్రజలపైకి ఓ ఉగ్రవాది భారీ ట్రక్కుతో దూసుకెళ్లి దారుణంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు మొత్తం 84 మంది మృతి చెందారు. ఈ దాడిని తామే చేశామని ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ఈరోజు ప్రకటించింది. ఫ్రాన్స్ తమపై పోరాడుతున్నందుకే ప్రతిదాడి చేశామని స్పష్టం చేసింది. నీస్ దాడి ఘటనలో పోలీసులు ఇప్పటివరకు ఐదుగురు నిందితులని అదుపులోకి తీసుకున్నారు.