: ఫేస్ బుక్ ఖాతా తెరిచిన కత్రినా కైఫ్


బాలీవుడ్ సుందరాంగి కత్రినా కైఫ్ ఎట్టకేలకు ఫేస్ బుక్ లో అడుగుపెట్టింది. ట్విట్టర్ లో చురుగ్గా ఉండే కత్రినా కైఫ్ ఫేస్ బుక్ లో ఇంతవరకు అకౌంట్ తెరవలేదు. దీనిని ఆసరా చేసుకున్న ఫేక్ గాళ్లు ఆమె పేరిట నకిలీ ఖాతాలు తెరిచి ప్రచారం పొందుతున్నారు. దీంతో సన్నిహితుల సలహాతో నకిలీలకు అడ్డుకట్ట వేయాలని భావించిన కత్రినా ఫేస్ బుక్ ఖాతా తెరిచింది. బీచ్ ఒడ్డున ఉన్న అపార్ట్ మెంట్ టెర్రస్ పై నిల్చుని ఫేస్ బుక్ లోకి ఎంట్రీ అవుతున్నానని చెప్పిన వీడియోను కత్రినా పోస్టు చేసింది. ఫేస్ బుక్ ఖాతా తెరిచిన 24 గంటల్లోగా కత్రినాను 36 లక్షల మంది అనుసరించడం విశేషం. గూగుల్ సెర్చ్ లో ద్వితీయ స్థానంలో నిలిచిన కత్రినా ఫేస్ బుక్ ఖాతా తెరవడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News