: చంద్రబాబు తీరు... పని తక్కువ, ప్రచారం ఎక్కువ: వైసీపీ విసుర్లు


నేటి ఉదయం హైదరాబాదులోని లోటస్ పాండ్ కార్యాలయంలో ప్రారంభమైన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. సమావేశంలో భాగంగా పార్లమెంటులో వ్యవహరించాల్సిన తీరుకు సంబంధించి ఓ స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకున్న వైసీపీ... టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. పని తక్కువ, ప్రచారం ఎక్కువ చందంగా చంద్రబాబు పాలన సాగుతోందని విమర్శించింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సవరణలు చేయాలని డిమాండ్ చేసిన ఈ సమావేశం... ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వే జోన్ కోసం పార్లమెంటులో పోరు సాగించాలని నిర్ణయించింది. ఇక ఇటీవలే పార్టీని వీడిన ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైనా లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేయాలని తీర్మానించింది.

  • Loading...

More Telugu News