: శ్రీవారికి భారీ విరాళాన్ని అందించిన భక్తుడు


తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరుడికి ఓ భక్తుడు ఈరోజు భారీ విరాళాన్ని అందించారు. శ్రీ‌వారి భ‌క్తుడు, టీవీఎస్‌ మోటార్స్‌ అధినేత శ్రీనివాసన్ ఈరోజు తిరుమ‌ల వెంక‌న్న‌ను ద‌ర్శించుకుని, రెండు కోట్ల రూపాయ‌లను విరాళంగా అందించారు. దీనికి సంబంధించిన చెక్కును టీటీడీ ఈవో సాంబ‌శివ‌రావుకి అందించి, త‌న విరాళాన్ని అన్న ప్రసాదం ట్రస్టుకు అందిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. శ్రీనివాసన్ ఇచ్చిన విరాళం ప‌ట్ల టీటీడీ అధికారులు హ‌ర్షం వ్య‌క్తం చేసి, ఆయ‌న‌ను ప్ర‌శంసించారు.

  • Loading...

More Telugu News