: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన
రెండు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టిన అనంతరం తెలుగు రాష్ట్రాలకు విశాఖ వాతావరణ శాఖ వర్షసూచన చేసింది. రాగల 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఒడిశా, కోస్తాంధ్ర నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని, నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.