: అరుణాచల్ సీఎల్పీ నేతగా పేమా ఖండూ!... నబమ్ తుకీ స్థానంలో ఏకగ్రీవంగా ఎన్నిక!
పెను రాజకీయ సంచలనాలకు నిలయంగా మారిన అరుణాచల్ ప్రదేశ్ లో మరిన్ని ఆశ్చర్యకర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పుతో కోల్పోయిన అధికారాన్ని తిరిగి చేజిక్కించుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నేడు తన పదవి నుంచి దిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలతో నిన్న రాత్రి భేటీ అయిన ఆ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్షం తమ నేత(సీఎల్పీ నేత) గా నబం తుకీ స్థానంలో పేమా ఖండూను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. గవర్నర్ ఆదేశాల ప్రకారం నేడు నబం తుకీ బలపరీక్షలో నెగ్గిన మరుక్షణమే ముఖ్యమంత్రిగా తుకీ స్థానంలో ఖండూ పదవీ ప్రమాణం చేయనున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గవర్నర్ ఆదేశాలు చెల్లవని ఓ వైపు తుకీ వర్గం చెబుతుంటే... రాజ్ భవన్ మాత్రం బల పరీక్ష జరిగి తీరాల్సిందేనని పట్టుబడుతోంది.