: రాయపాటికి సతీ వియోగం!... స్వయంగా ఫోన్ చేసి సంతాపం తెలిపిన చంద్రబాబు!
టీడీపీ సీనియర్ నేత, గుంటూరు జిల్లా నరసరావుపేట లోక్ సభ సభ్యుడు రాయపాటి సాంబశివరావు సతీమణి లీలాకుమారి (67) నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆమె మరణించారు. నిన్న రాత్రి దాకా పూర్తి ఆరోగ్యంగానే ఉన్న లీలాకుమారి రాత్రి పొద్దుపోయిన తర్వాత గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు స్పందించి ఆసుపత్రికి తరలించేలోగానే ఆమె మరణించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు... రాయపాటికి స్వయంగా ఫోన్ చేశారు. లీలాకుమారి మృతికి సంతాపం ప్రకటించిన చంద్రబాబు రాయపాటిని ఓదార్చారు. నేటి సాయంత్రం గుంటూరులోని లక్ష్మీపురంలో లీలాకుమారి అంత్యక్రియలు జరగనున్నాయి.