: కేవీపీ బిల్లుకు టీడీపీ మద్దతు!... ‘హోదా’ కోసం బిల్లుకు ఓటేయాలన్న చంద్రబాబు!


ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు మరింత మద్దతు లభించింది. ఈ బిల్లు ఓటింగ్ వరకు వస్తే... దానికి అనుకూలంగా ఓటేయాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నిన్న తీర్మానించింది. నిన్న విజయవాడలో జరిగిన భేటీలో ఈ మేరకు పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు మాట్లాడినా... పార్టీలతో ప్రమేయం లేకుండా మద్దతు తెలపాలని కూడా చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

  • Loading...

More Telugu News