: నవ్యాంధ్ర పంద్రాగస్టు వేడుకలు ఎక్కడ?


నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని లేకుండానే పాలనను నెట్టుకొస్తోంది. గుంటూరు జిల్లా తుళ్లూరు పరిధిలో అమరావతి పేరిట రాజధాని కోసం భూసేకరణ పూర్తి చేసిన చంద్రబాబు సర్కారు... ప్రస్తుతానికి అక్కడి వెలగపూడిలో తాత్కాలిక సచివాలయాన్ని మాత్రం ఏర్పాటు చేసుకోగలిగింది. ఈ తాత్కాలిక సచివాలయం కూడా ఈ నెలాఖరు నాటికి గాని పూర్తి కాదు. మరి భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎక్కడ నిర్వహించాలి? రాష్ట్ర విభజన తర్వాత తొలి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను రాయలసీమ ముఖద్వారం కర్నూలులో నిర్వహించిన ప్రభుత్వం తాజాగా ఆ వేడుకలను ఎక్కడ నిర్వహించాలన్న అంశంపై మల్లగుల్లాలు పడుతోంది. ఈ దఫా కూడా రాయలసీమలోని అనంతపురం జిల్లాలో పంద్రాగస్టు వేడుకలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అందిన సంకేతాలతో అనంతపురంలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (పీటీసీ) గ్రౌండ్ ను జిల్లా కలెక్టర్ కోన శశిధర్ నిన్న పరిశీలించారు. పంద్రాగస్టు వేడుకల నిర్వహణపై త్వరలోనే ఓ ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News