: ఎలా ముందుకెళ్దాం?... పార్లమెంటు వ్యూహంపై నేడు వైసీపీ భేటీ!
పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో పార్లమెంటు ఉభయ సభల్లో స్థానం దక్కించుకున్న ఏపీలోని విపక్షం వైసీపీ నేడు హైదరాబాదులో కీలక భేటీ నిర్వహించనుంది. లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నేడు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పార్టీ లోక్ సభ సభ్యులతో పాటు ఇటీవలే రాజ్యసభలో అడుగుపెట్టిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి కూడా హాజరు కానున్నారు. పార్టీ ఫిరాయించిన సభ్యులను ఎన్నికల నుంచి బహిష్కరించాలంటూ సాయిరెడ్డి మొన్న రాజ్యసభలో ప్రైవేట్ బిల్లును ప్రతిపాదించిన నేపథ్యంలో నేటి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.