: ఆర్మీ స్కూల్ అల్పాహారం తిన్న విద్యార్థి మృతి.. పలువురికి అస్వస్థత
కోయంబత్తూరులోని ప్రముఖ సైనిక్ ఆర్మీ స్కూల్ లో చదువుకుంటున్న విద్యార్థులు అల్పాహారం తిన్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో వీరిలో ఓ విద్యార్థి మృతి చెందాడు. ఉదుమల్ పేట సమీపంలోని అమరావతిలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయం హాస్టల్ లో అల్పాహారం తీసుకున్న విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు లోనయ్యారు. జ్వరం, వికారంతో బాధపడ్డారు. ఆరో తరగతి చదువుతున్న 11 ఏళ్ల వి. సిద్ధార్థ్ అనే బాలుడు మృతి చెందాడు. విషయం తెలిసిన విద్యార్థుల కుటుంబ సభ్యులు ఉదుమల్ పేట-పలానీ హైవేపై ఆందోళనకు దిగారు. దీంతో ట్రాఫిక్ స్తంభించి పోయింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆర్మీ స్కూలు ఈనెల 24 వరకు సెలవులు ప్రకటించింది.