: విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత!


విజయవాడలోని ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు రోజుల క్రితం బిడ్డను పోగొట్టుకున్న కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. పోలీసులు దర్యాప్తు నత్తనడకన సాగిస్తున్నారని ఆరోపించిన బాధిత కుటుంబం... ఆసుపత్రి సిబ్బందిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ బిడ్డను ఎత్తుకెళ్లిపోయినప్పుడు ఆసుపత్రిలోని ఐసీయూ విభాగంలో, సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. వారిని తమకు అప్పగిస్తే తమ బిడ్డ ఏమయ్యాడో? ఎక్కడున్నాడో? నిజాలు కక్కిస్తామని చెబుతున్నారు. ఆసుపత్రి సిబ్బంది హస్తం లేకుండా బిడ్డను అపహరించడం సాధ్యం కాదని వారు మండిపడుతున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

  • Loading...

More Telugu News