: విజయవాడలో ప్రారంభమైన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
విజయవాడలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పార్లమెంటు సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రనర్వ్యవస్థీకరణ బిల్లుపై కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు చర్చకు రానుంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రంలో ప్రభుత్వానికి, పార్టీకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గట్టెక్కడం ఎలా? అలాగే విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఎలా రప్పించుకోవాలి? అన్న విషయాలను చర్చించనున్నారు. కాగా, సమావేశంలో టీడీపీ ఎంపీలతో పాటు, ఆహ్వానంపై బీజేపీ ఎంపీలు కూడా పాల్గొన్నారు.