: మేము విడుదల చేసిన చిత్రాల్లోని మహిళలే శిశువుని కిడ్నాప్ చేసి ఉండవచ్చు: పోలీసులు
విజయవాడలోని పాత ప్రభుత్వాసుపత్రిలో నిన్న పసిబిడ్డ అపహరణకుగురయిన కేసులో మరో ట్విస్ట్ ఎదురయింది. పోలీసులు విడుదల చేసిన చిత్రాలపై స్పందించిన పలువురు మహిళలు గుంటూరులో పోలీసులని ఆశ్రయించారు. తాము శిశువుని అపహరించలేదని చెప్పారు. అయితే, తాము నిన్న విడుదల చేసిన ఫోటోల్లోని మహిళలు ఈరోజు గుంటూరు పోలీసులని ఆశ్రయించిన మహిళలు ఒక్కటి కాదని విజయవాడ పోలీసులు చెప్పారు. సదరు మహిళలు చేస్తోన్న వాదనలతో పోలీసులు విభేదిస్తున్నారు. నిన్న విడుదల చేసిన చిత్రాలకు తాము కట్టుబడి ఉన్నామని, ఆ చిత్రాల్లోని మహిళలే బాబుని కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు చెబుతున్నారు.