: హోంగార్డుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: ప్రొ.కోదండరాం
తెలంగాణలో హోంగార్డుల సమస్యలపై జేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరాం ఈరోజు డీజీపీ అనురాగ్ శర్మతో సమావేశమయ్యారు. హోంగార్డుల సమస్యల పరిష్కారానికి సంబంధించిన అంశాలను ఆయన జేఏసీ సభ్యులతో కలిసి డీజీపీకి వివరించారు. చాలా కాలంగా కొనసాగుతోన్న ఆర్డర్లీ వ్యవస్థను రద్దు చేయాలని, హోంగార్డుల సమస్యల పరిష్కారం దిశగా తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.