: మైనర్లను మందు కొట్టమని పిలవం... మమ్మల్ని నిందించడం సరికాదు: మద్యం షాపుల యజమానులు


మైనర్లకు మద్యం సరఫరా చేస్తున్నామంటూ తమను నిందించడం సరికాదని మద్యం దుకాణం యజమానులు మండిపడుతున్నారు. మద్యం తాగమని తాము ఎవరినీ ప్రలోభపెట్టడం లేదని అన్నారు. హైదరాబాదులో వీరు ఈ రోజు మాట్లాడుతూ, తమపై టార్గెట్ తుపాకులు ఎక్కుపెట్టి, రుసుములు వసూలు చేస్తూ, 'హ్యాపీ అవర్స్' లేవు, అందుకు సంబంధించి ఆఫర్లు పెట్టవద్దంటే ఎలా? అని వారు ప్రశ్నించారు. ప్రభుత్వం తమ వద్ద నుంచి భారీ ఎత్తున ఫీజులు, ట్యాక్సు రూపంలో వసూలు చేస్తూ, మరోపక్క మీరు మాత్రం వ్యాపారం చేయకండని చెబుతోందని వారు మండిపడ్డారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు దానిని కట్టడి చేయాల్సిన వారు చేయడం మానేసి, తమను నిందించడం ఎంతవరకు సబబు? అని వారు ప్రశ్నించారు. తప్పు జరిగినప్పుడు నిందితులపై కఠిన చట్టాలు ప్రయోగించాలని, తద్వారా నేరాలు, ఘోరాలు జరగకుండా చూడాలని వారు సూచించారు. నేరం చేసి ఎవరైనా పట్టుబడితే వారిపై పకడ్బందీ ఛార్జిషీట్లు తయారు చేసి, బెయిల్ వంటివి రాకుండా చేసి, వారిని కటకటాల వెనక్కి నెడితే, అలాంటి తప్పులు చేయడానికి ఇతరులు వెనకాడుతారని వారు అన్నారు. అలా కాకుండా నిబంధనలకు అనుగుణంగా వ్యాపారాలు చేస్తున్న తమను నిరోధించడం ఎంతవరకు సబబని వారు ప్రశ్నించారు. వ్యాపారంలో లక్ష రూపాయలు నష్టం వస్తే భరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, కోటి రూపాయల నష్టాన్ని భరించేందుకు మాత్రం తాము సిద్ధంగా లేమని వారు స్పష్టం చేశారు. మైనర్లను మందుకొట్టమని తాము పిలవమని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News